వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘నారాయణమ్మ’ ఫోక్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేయడంతోపాటు ధనుంజయ్ సీపాన, రణినా రెడ్డి కలిసి పాడాడు. ‘అరేబియా అత్తర్ సెంటూ.. గమ్మత్తుగా గమ్ గమ్ అంటూ.. నీ నుంచి నాదాకా ఫ్లైఓవర్ వేస్తాందే.. ఏ కష్టం నీకొద్దే పిల్ల.. ఎదురింట్లో నేనుండగా.. సింగిల్‌గా ఎన్నాళ్లీలా.. సిటికేస్తే వస్తాగా.. మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు..’ అంటూ రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించారు.
భాను మాస్టర్ కొరియోగ్రఫీలో వెంకటేష్, నివేదా పేతురాజ్ జోడీ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, నారా రోహిత్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
